26 ఏళ్ల తర్వాత నిజాంపేట్ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గురువులకు ఘన సత్కారం – పాఠశాల జ్ఞాపకాలతో భావోద్వేగ క్షణాలు
“చదువే జీవితానికి మూలాధారం” – రిటైర్డ్ ఉపాధ్యాయుడు కృష్ణమాచారి సందేశం
పాఠశాల జ్ఞాపకాలలతో తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న
నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 26 ఏళ్ల అనంతరం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమావేశం ఎంతో ఆనందభరితంగా, భావోద్వేగపూరితంగా జరిగింది.ఈ సందర్భంగా తమకు విద్యాబోధ చేసిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు వేదికపైకి వచ్చి తమ జీవిత అనుభవాలను, పాఠశాల రోజుల జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ రోజులను
గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు కృష్ణమాచారి మాట్లాడుతూ, పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాల విలువలు నేర్పించడం ఎంతో అవసరమన్నారు. చదువు విషయంలో ఎలాంటి అవరోధాలు వచ్చినా వెనుకడుగు వేయకూడదని సూచించారు. “చదువే జీవితానికి మూలాధారం” అని ఆయన పేర్కొన్నారు.
గురువులకి తమ శిష్యులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడే అసలైన గౌరవం లభిస్తుందని ఆయన తెలిపారు. తమ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగిన విషయమని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురునాథ్, నరేందర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్ గంగాధర్, లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యం, నగేష్, మధు, ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న, శిరీష, శ్వేత, శ్రీవిద్యతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మొత్తంగా ఈ సమ్మేళనం పాత స్నేహాలను పునరుద్ధరించడంతో పాటు గురు-శిష్య బంధాన్ని మరింత బలపరచడం , పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం తో తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆనందంగా గడిపారు