అంగన్వాడీలలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.

అంగన్వాడీలలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.
–“పోషణ పక్వాడ” కార్యక్రమం పై సిబ్బంది అవగాహన.
తాండూరు, ఏప్రిల్ 15: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలను సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బుధవారంపట్టణంలోని 33 వ వార్డు వడ్డెర గల్లి అంగన్వాడి కేంద్రం-1,గాంధీనగర్, శంషార్ గంజ్ అంగన్వాడిల ఆధ్వర్యంలో అంగన్వాడిలో “అభివృద్ధి మైలురాళ్లు” అంశం పై ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ పిల్లల శారీరక, మానసిక, భాషా మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన దశలను వివరంగా తెలియజేశారు. పిల్లలు ఏ వయస్సులో ఏ నైపుణ్యాలు సాధించాలి, ఆ అభివృద్ధిని ఎలా గుర్తించాలి తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలలో ఎలా సహకరించాలి అనే అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం ఎంతో అవసరమని, ముఖ్యంగా తల్లిపాలు, సమయానుకూలంగా ఇచ్చే సప్లిమెంటరీ ఆహారం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల ఎదుగుదల మరింత మెరుగు పడుతుందని సూచించారు. అలాగే పిల్లల అభివృద్ధిలో ఏవైనా ఆలస్య లక్షణాలు కనిపించినపుడు వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రాజేశ్వరి, అరుణ, రాధా, ఏఎన్ఎం శాంత ఆశా వర్కర్ సుజాత, ఆయా లక్ష్మి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

.

అంగన్వాడీలలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.

అంగన్వాడీలలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.
--"పోషణ పక్వాడ" కార్యక్రమం పై సిబ్బంది అవగాహన.
తాండూరు, ఏప్రిల్ 15: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలను సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బుధవారంపట్టణంలోని 33 వ వార్డు వడ్డెర గల్లి అంగన్వాడి కేంద్రం-1,గాంధీనగర్, శంషార్ గంజ్ అంగన్వాడిల ఆధ్వర్యంలో అంగన్వాడిలో "అభివృద్ధి మైలురాళ్లు" అంశం పై ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ పిల్లల శారీరక, మానసిక, భాషా మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన దశలను వివరంగా తెలియజేశారు. పిల్లలు ఏ వయస్సులో ఏ నైపుణ్యాలు సాధించాలి, ఆ అభివృద్ధిని ఎలా గుర్తించాలి తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలలో ఎలా సహకరించాలి అనే అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం ఎంతో అవసరమని, ముఖ్యంగా తల్లిపాలు, సమయానుకూలంగా ఇచ్చే సప్లిమెంటరీ ఆహారం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల ఎదుగుదల మరింత మెరుగు పడుతుందని సూచించారు. అలాగే పిల్లల అభివృద్ధిలో ఏవైనా ఆలస్య లక్షణాలు కనిపించినపుడు వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రాజేశ్వరి, అరుణ, రాధా, ఏఎన్ఎం శాంత ఆశా వర్కర్ సుజాత, ఆయా లక్ష్మి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

.

🗓 15 Apr 2026 | 07:33 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top