ప్రజల మేలుకోసమే ఉచిత వైద్య శిబిరం
– నాగిరెడ్డి పల్లి సర్పంచ్ శేఖర్
వికారాబాద్,నవాబ్ పేట్:ప్రజల మేలుకోసమే ఉచిత వైద్య శిబిరమని నాగిరెడ్డి పల్లి సర్పంచ్ శేఖర్ అన్నారు.శుక్రవారం నవాబ్ పేట్ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లి హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ,షుగర్ పరీక్షలతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.గ్రామ ప్రజల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యం.ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా విద్యులను ఆశ్రయించడం ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చని సూచించారు.అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం అడగగానే ఉచిత వైద్య శిబిర ఏర్పాటు చేసిన మమత అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైదరాబాద్ వారికీ మా గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధీరత్ రెడ్డి, వైద్యులు మోహన్ గుప్తా,ఆర్యన్ కుమార్,పీఆర్డీ కావ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మేలుకోసమే ఉచిత వైద్య శిబిరం – నాగిరెడ్డి పల్లి సర్పంచ్ శేఖర్
ప్రజల మేలుకోసమే ఉచిత వైద్య శిబిరం
- నాగిరెడ్డి పల్లి సర్పంచ్ శేఖర్