చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 6 కొత్త బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు మంజూరు

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవ ఫలితం

టవర్ల నిర్మాణానికి భూముల కేటాయింపు కోసం కలెక్టర్‌ను కోరిన దిశ కమిటీ సభ్యులు

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు కొత్త బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ టవర్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ఈ టవర్ల మంజూరు కీలకంగా మారింది.టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు పరిగి నియోజకవర్గానికి చెందిన ఘనపూర్ వెంకటయ్య, వేముల పెంటయ్య గుప్తా, వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన పోకల సతీష్, తాండూర్ నియోజకవర్గానికి చెందిన గాజుల శాంత్ కుమార్ లు స్థానిక అవసరాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ టవర్ల మంజూరు సాధ్యమైంది.మంజూరైన ఆరు టవర్లలో వికారాబాద్ జిల్లాకు అత్యధికంగా ఐదు టవర్లు రావడం విశేషం. మోమిన్‌పేట్ మండలంలోని దుర్గంచెరువు, సయ్యదలిపూర్ గ్రామాలకు రెండు టవర్లు, తాండూర్ నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండలం ఖ్యాదిగిరీ, పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామాలకు రెండు టవర్లు, పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలం మక్త వెంకటాపూర్ గ్రామానికి ఒక టవర్ మంజూరయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మరో టవర్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించాలని కోరుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పంపిన మంజూరు పత్రాలను మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, దిశా కమిటీ సభ్యుడు మిట్ట పరమేశ్వర్ రెడ్డి ద్వారా జిల్లా కలెక్టర్ దీపక్ తివారికు అందజేశారు.
భూముల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తే టవర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తై గ్రామీణ ప్రాంత ప్రజలకునాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని దిశ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి భూ కేటాయింపుల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది తెలిపారు

🗓 05 Jun 2026 | 06:18 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top