జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
ప్రజాగాయకుడు గద్దర్ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులు
: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆధ్వర్యంలో బొంరాస్పేట్ మండల విద్యావనరుల కేంద్రం (ఎంఆర్సీ), మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
జయశంకర్ సార్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధి హామీ మండలి రాష్ట్ర సభ్యుడు నరసింహులు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్తగా, దార్శనికుడిగా, ఉద్యమ స్ఫూర్తిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని మేధావుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.ప్రజాగాయకుడు గద్దర్ తన పాటలతో ఉద్యమాలకు ఊపిరి పోసి, సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన గానం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, సామాజిక మార్పుకు ఆయుధంగా నిలిచిందని అన్నారు.
జిల్లా కార్యదర్శులు భాకారం చంద్రశేఖర్, పల్నాటి అనిల్ కుమార్, జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ గౌరారం గోపాల్ మాట్లాడుతూ.., జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని, యువత ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈనాడు నర్సింలు, ఆంధ్రజ్యోతి అంజయ్య, ఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని జయశంకర్ సార్, గద్దర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

మహనీయుల స్ఫూర్తితో సమాజ సేవకు ముందుకు రావాలి టీవీవీ ఆధ్వర్యంలో జయంతి–వర్ధంతి కార్యక్రమం
జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
ప్రజాగాయకుడు గద్దర్ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులు
: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆధ్వర్యంలో బొంరాస్పేట్ మండల విద్యావనరుల కేంద్రం (ఎంఆర్సీ), మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
జయశంకర్ సార్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధి హామీ మండలి రాష్ట్ర సభ్యుడు నరసింహులు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ...