సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిదా?
మాజీ కౌన్సిలర్ పై 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ ఫైర్
ఎన్టీఆర్ నగర్‌లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం..
అభివృద్ధి పనులపై రాజకీయ విమర్శలకు కౌన్సిలర్ కౌంటర్
తాండూర్ పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ 7వ వార్డులో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు కౌన్సిలర్ ఇర్షాద్ శ్రీకారం చుట్టారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్ సహకారంతో తిరిగి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ అభివృద్ధి పనులపై కొంతమంది మాజీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడంతో కౌన్సిలర్ ఇర్షాద్ ఘాటుగా స్పందించా
రు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ.. గతంలో కాలనీలో కొన్ని అభివృద్ధి పనులు కొనసాగాయని, ఎన్నికల సమయంలో కొన్ని పనులు పెండింగ్‌లోకి వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పెండింగ్ పనులను తమ ఆధ్వర్యంలో తిరిగి చేపట్టి పూర్తి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే వాటిని కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు.“సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది” అంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలపై ఇర్షాద్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులకు మాజీ కౌన్సిలర్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే మున్సిపాలిటీకి నిధులు వస్తాయని, అదే ప్రజాధనంతో కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కౌన్సిలర్ ఇర్షాద్ పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో జరుగుతున్న అభివృద్ధి పనులపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారని, ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. “అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.. ప్రజల ముందే మా పనితీరు నిరూపించుకుంటాం” అని కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు.
కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకల సమస్యలు తగ్గడంతో పాటు వర్షాకాలంలో ఇబ్బందులు కూడా తొలగుతాయని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిద.. ఏం మాట్లాడుతున్నావ్.. గుర్తులేదా.
సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిదా?
మాజీ కౌన్సిలర్ పై 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ ఫైర్
ఎన్టీఆర్ నగర్‌లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం..
అభివృద్ధి పనులపై రాజకీయ విమర్శలకు కౌన్సిలర్ కౌంటర్తాండూర్ పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ 7వ వార్డులో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు కౌన్సిలర్ ఇర్షాద్ శ్రీకారం చుట్టారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్ సహకారంతో తిరిగి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ అభివృద్ధి పనులపై కొంతమంది మాజీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడంతో కౌన్సిలర్ ఇర్షాద్ ఘాటుగా స్పందించారు.