కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
2026–27 విద్యా సంవత్సరానికి బాధ్యతలు స్వీకరించిన విద్యార్థి నాయకులు
నాయకత్వం అంటే సేవాభావమే.. డీఎస్పీ
జాతీయ ర్యాంకర్ల విద్యార్థులకు ఘన సత్కారం
ఆకట్టుకున్న విద్యార్థులకవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్వెస్టిచర్ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తాండూరు
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం కార్యక్రమానికి దేశభక్తి వాతావరణాన్ని తీసుకొచ్చింది. పాఠశాల పతాకంతో పాటు వివిధ హౌస్‌ల జెండాలను అతిథులు చే ఆవిష్కరించారు.ఈ విద్యా సంవత్సరానికి హెడ్ బాయ్‌గా చరణ్ సాయి, డిప్యూటీ హెడ్ బాయ్‌గా సాకేత్, హెడ్ గర్ల్‌గా లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా వర్ధిని బాధ్యతలు చేపట్టారు. అలాగే లిటరేచర్, కల్చరల్, డిసిప్లిన్, స్పోర్ట్స్ విభాగాలతో పాటు వివేకానంద, సర్దార్ వల్లభభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ హౌస్‌లకు ఎన్నికైన కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు బాధ్యతలు స్వీకరించారు.
వీరికిడీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్లు సతీష్, వెంకటేశం, మల్లేశం లు బ్యాడ్జీలు, శాష్‌లు ధరింపజేసి అభినందించారు. అనంతరం డీఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల గౌరవాన్ని కాపాడుతూ నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ.. నాయకత్వం అనేది కేవలం ఒక పదవి కాదని, జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం, సేవాభావం, వినయం, బాధ్యత కలయికేనని పేర్కొన్నారు.
ఆలాగే డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ..,
విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అలవరచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పాఠశాల దశలో అలవడే క్రమశిక్షణ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది అవుతుందని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా స్పీడ్ లాబ్స్ ఐఐటీ/నీట్
పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. జి. స్పృథిక, ఎం. గీతిక త్రినయన జాతీయ తొలి ర్యాంకు, బి. ఆరోషి రెండో ర్యాంకు, కె. లక్ష్మీ ప్రసన్న మూడో ర్యాంకు సాధించిన సందర్భంగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.ప్రమాణ స్వీకారం అనంతరం హెడ్ బాయ్ చరణ్ సాయి నాయకత్వంలో నిర్వహించిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాల ఆవరణ నాయకత్వ స్ఫూర్తితో కళకళలాడింది.
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
2026–27 విద్యా సంవత్సరానికి బాధ్యతలు స్వీకరించిన విద్యార్థి నాయకులు
నాయకత్వం అంటే సేవాభావమే.. డీఎస్పీ
జాతీయ ర్యాంకర్ల విద్యార్థులకు ఘన సత్కారం
ఆకట్టుకున్న విద్యార్థులకవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్వెస్టిచర్ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తాండూరు
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం కార్యక్రమానికి దేశభక్తి వాతావరణాన్ని తీసుకొచ్చింది. పాఠశాల పతాకంతో పాటు వివిధ హౌస్‌ల జెండాలను అతిథులు చే ఆవిష్కరించారు.ఈ విద్యా సంవత్సరానికి హెడ్ బాయ్‌గా చరణ్ సాయి, డిప్యూటీ హెడ్ బాయ్‌గా సాకేత్, హెడ్ గర్ల్‌గా లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా వర్ధిని బాధ్యతలు చేపట్టారు. అలాగే లిటరేచర్, కల్చరల్, డిసిప్లిన్, స్పోర్ట్స్ విభాగాలతో పాటు వివేకానంద, సర్దార్ వల్లభభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ హౌస్‌లకు ఎన్నికైన కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు బాధ్యతలు స్వీకరించారు. వీరికిడీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్లు సతీష్, వెంకటేశం, మల్లేశం లు బ్యాడ్జీలు, శాష్‌లు ధరింపజేసి అభినందించారు. అనంతరం డీఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల గౌరవాన్ని కాపాడుతూ నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన సూచించారు.