వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

రోహిత్ రెడ్డిపై విమర్శలు మానుకోవాలి”

కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ బాండ్ 

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురించి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు వెంటనే
వెన్నక్కి తీసుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు అనితాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ బాండ్ అన్నారు.శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు తమ రాజకీయ గతాన్ని గుర్తు చేసుకోవాలని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
తాండూర్ పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా తమ వార్డుల అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని, ఆ తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు.రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, అనేక అభివృద్ధి పనులకు నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు రోహిత్ రెడ్డి అని కొనియాడారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేసిన నాయకుడు రోహిత్ రెడ్డి అని పేర్కొంటూ, వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుందని, అప్పుడే ప్రజా సంక్షేమం అంటే ఏమిటో పనుల ద్వారా చూపిస్తామని అనిల్ బాండ్ అన్నారు. రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించాలని, మాజీ ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

రోహిత్ రెడ్డిపై విమర్శలు మానుకోవాలి"

🗓 07 Aug 2026 | 01:51 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top