వికారాబాద్ బీజేపీకి కొత్త సారథి.. యు. రమేశ్‌కుమార్
జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యం
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ
గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తాం:
నూతన అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్
భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా యు. రమేశ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర నాయకత్వం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ ముఖ్య నాయకులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రమేశ్‌కుమార్‌ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం పై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ.. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నాయకులు సూచించారు. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా బీజేపీకి బలమైన పునాది నిర్మించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తామని చెప్పారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచి.. నిరంతర ప్రజా పోరాటాల ద్వారా వికారాబాద్ జిల్లాలో బీజేపీకి మరింత బలమైన పునాది నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఆలాగే తనపై నమ్మకం ఉంచి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి రమేశ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణం ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, గిరామోని శ్రీనివాస్, శంకర్‌నాయక్, సాహు, శ్రీలత, శ్రీధర్‌రెడ్డి, వీబీ రెడ్డి, మారుతీ కిరణ్, మిట్ట పరమేశ్వర్, వడ్ల నందు, ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ ముదిరాజ్, భద్రశ్వర్, కేశవ్లు, యాదవ్, నాగారం మల్లేశం, శిరీష, రాజేందర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, బాలేశ్వర గుప్తా, పటేల్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్‌ను నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు
వికారాబాద్ బీజేపీకి కొత్త సారథి.. యు. రమేశ్‌కుమార్ జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యం
వికారాబాద్ బీజేపీకి కొత్త సారథి.. యు. రమేశ్‌కుమార్
జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యం
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ
గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తాం:
నూతన అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్
భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా యు. రమేశ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర నాయకత్వం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ ముఖ్య నాయకులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రమేశ్‌కుమార్‌ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం పై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ.. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నాయకులు సూచించారు. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా బీజేపీకి బలమైన పునాది నిర్మించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో నూతన జిల్లా అధ్యక్షులు యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ..పార్టీలోని ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో బీజేపీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తామని చెప్పారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచి.. నిరంతర ప్రజా పోరాటాల ద్వారా వికారాబాద్ జిల్లాలో బీజేపీకి మరింత బలమైన పునాది నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఆలాగే తనపై నమ్మకం ఉంచి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి రమేశ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.ఈ కార్యక్రమంలో కర్ణం ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, గిరామోని శ్రీనివాస్, శంకర్‌నాయక్, సాహు, శ్రీలత, శ్రీధర్‌రెడ్డి, వీబీ రెడ్డి, మారుతీ కిరణ్, మిట్ట పరమేశ్వర్, వడ్ల నందు, ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ ముదిరాజ్, భద్రశ్వర్, కేశవ్లు, యాదవ్, నాగారం మల్లేశం, శిరీష, రాజేందర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, బాలేశ్వర గుప్తా, పటేల్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్‌ను నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు