విలేకరులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి టిఫిన్ ముచ్చట్లు నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికీలేకరులతో టిఫిన్ చేస్తూనే.. నియోజకవర్గ అభివృద్ధి నుంచి నిరుద్యోగులు, రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి, అక్రమ ఇసుక వరకు.. పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే మనసులోని మాట బయటపెట్టారు.
ఇక తాండూరులో ప్రక్రియ 100 శాతం పూర్తయిందని ప్రకటించిన ఎమ్మెల్యే..
ఎప్పటికప్పుడు వివరాలు అందించిన SIR కన్వీనర్ కరణం పురుషోత్తంను అభినందించారు.
రిపోర్టర్ – ఎమ్మెల్యే చిట్‌చాట్
రిపోర్టర్:
సార్.. తాండూరులో ప్రక్రియ పూర్తయిందా?
ఎమ్మెల్యే:
అవును.. తాండూరులో 100 శాతం ప్రక్రియ పూర్తయింది. ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ ప్రక్రియను విజయవంతం చేసిన కన్వీనర్ కర్ణ పురుషోత్తంను అభినందిస్తున్నాను.
రిపోర్టర్:
సార్.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తవుతాయి?
ఎమ్మెల్యే:
హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రానున్న ఎన్నికలకు ఒక సంవత్సరం ముందే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేలా పనిచేస్తాం.
రిపోర్టర్:
సర్వే నంబర్ 135 విషయంలో ఏం జరుగుతుంది?
ఎమ్మెల్యే:
సర్వే నంబర్ 135లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తాం.
రిపోర్టర్:
నిరుద్యోగ యువతకు ఏమైనా గుడ్ న్యూస్ ఉందా?
ఎమ్మెల్యే:
ఉంది. త్వరలోనే నిరుద్యోగ యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది ఉపయోగపడుతుంది.
రిపోర్టర్:
రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుంది సార్?
ఎమ్మెల్యే:
కొత్త రోడ్లకు ప్రతిపాదనలు లేకపోవడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణం వరకు ఉన్న పాత రోడ్లకు మరమ్మత్తులు చేపట్టి ఆధునీకరిస్తాం.
రిపోర్టర్:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా ఉండబోతున్నాయి?
ఎమ్మెల్యే:
ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తాం. సర్జరీలు, ఐసీయూ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. 24 గంటల పాటు ప్రొఫెసర్లు, సర్జరీ సేవలు అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
రిపోర్టర్:
అక్రమ ఇసుక రవాణాపై ఏం చర్యలు తీసుకుంటారు?
ఎమ్మెల్యే:
అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేస్తాం. అయితే అభివృద్ధి పనులకు ఇసుక అవసరం. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జిల్లాకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి నిబంధనల ప్రకారం ఇసుక తరలించుకోవాలని సీఎం ఆదేశించారు
టిఫిన్ ముచ్చట్లలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాండూరులో చర్చనీయాంశంగా మారాయి.
ఒకవైపు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చెబుతూనే.. మరోవైపు అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రోడ్ల ఆధునీకరణ.. ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం.. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్.. సర్వే నంబర్ 135పై చర్యలు..ఇలా తాండూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే వరుస హామీలు ఇచ్చారు.“హమీలు మాటల్లో కాదు.. ఎన్నికలకు ఏడాది ముందే పనుల్లో కనిపించాలి” అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
విలేకరులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి టిఫిన్ ముచ్చట్లు