జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
ఆ ఆశయాలు విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదు:
సాంబురు సోమశేఖర్
తెలంగాణ జనసమితి, ప్రజాసంఘాలు, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులు
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్‌లో ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జనసమితి, ప్రజాసంఘాలు, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తాండూర్ ఇన్‌చార్జి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సాంబురు సోమశేఖర్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. గత ప్రభుత్వం ఆయనను తగిన స్థాయిలో గౌరవించలేదని, ప్రస్తుత ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఆయన జీవిత చరిత్ర, ఆలోచనా విధానం నేటి యువతకు చేరేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని, జయశంకర్ సార్ ఆశయాలే రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జయశంకర్ సార్ స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అదేవిదంగా
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి చేరేలా ప్రభుత్వం, మేధావులు, విద్యావేత్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆలాగే అధ్యాపకులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ.. జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, ఆయన జీవన ప్రస్థానం యువతకు తెలియజేయడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణలో కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా పాలన సాగాలని ఆకాంక్షించారు.
ఉద్యమ కళాకారుడు బలరాం ఆలపించిన ఉద్యమ గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాములు, జనసమితి నాయకులు గౌరీ, సందీప్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు చెనిమిళ్ల విజయ్ కుమార్, జీలకర్ర రవీందర్, అధ్యాపకులు రవీందర్ రెడ్డి, రాజశేఖర్, మున్సిపల్ జవాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
ఆ ఆశయాలు విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదు:
సాంబురు సోమశేఖర్
తెలంగాణ జనసమితి, ప్రజాసంఘాలు, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులుతెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్‌లో ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జనసమితి, ప్రజాసంఘాలు, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తాండూర్ ఇన్‌చార్జి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సాంబురు సోమశేఖర్ మాట్లాడుతూ..