జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

రోడ్డు మధ్యలో లారీ.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్

తాండూరు–లక్ష్మీనారాయణపూర్ మార్గంలో సంఘటన

ప్రయాణికులకు
వాహనాలు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రజలు..

జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం

జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వికారాబాద్ జిల్లా తాండూరు–లక్ష్మీనారాయణపూర్ ప్రధాన మార్గంలో శుక్రవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీరామపురం హనుమాన్ టెంపుల్ సమీపంలో రోడ్డు మధ్యలో ఓ భారీ లారీ ఇరుక్కుపోవడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
గంటల తరబడి కార్లు, బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడగా, పలువురు వాహనాలను అక్కడే నిలిపి కాలినడకన తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ మళ్లింపు, హెచ్చరిక బోర్డులు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యాడని స్థానికులు, వాహనదారులు మండిపడ్డారు. నిర్మాణ పనుల నిర్వహణలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

🗓 07 Aug 2026 | 02:48 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top