కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రైతు పంట పొలం జలమయం

జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రైతుకు తీవ్ర నష్టం

నీటిలో మునిగిపోయిన వినుము పంట, ఎరువు

నీటి పైపులు నిర్మాణం సరిగా చేపట్టకపోవడమే కారణం

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రూ. 6 లక్షల నష్టం జరిగిందని రైతు ఆవేదన

ప్రజా ప్రతినిధులు అధికారులు న్యాయం చేయాలని రైతు కోట్ల నరేందర్ రెడ్డి విజ్ఞప్తి.

జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తన పంటకు శాపంగా మారిందని ఓ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాలాల మండల పరిధిలోని లక్ష్మాపూర్–కొడంగల్ రహదారి మార్గంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా తన పంట పొలంలోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లిందని పాత తాండూర్‌కు చెందిన రైతు కోట్ల నరేందర్ రెడ్డి ఆరోపించారు.

రైతు వివరాల ప్రకారం.. యాలాల మండల పరిధిలో జాతీయ రహదారి పక్కనే తనకు సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఇటీవల వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు సక్రమంగా కురవకపోయినా మినుము పంట సాగు చేశానని తెలిపారు. మరోవైపు రానున్న రోజుల్లో చెరుకు పంట సాగు చేసేందుకు సుమారు రూ.2 లక్షల విలువైన ఎరువులను కొనుగోలు చేసి పొలంలో నిల్వ చేశానని చెప్పారు.అయితే జాతీయ రహదారి నిర్మాణ సమయంలో తన పంట పొలం నుంచి నీరు బయటకు వెళ్లేందుకు ఉన్న కాల్వ వద్ద సరైన పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదని రైతు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి సరైన ప్రవాహ మార్గం లేకపోవడంతో నీరంతా తన పంట పొలంలోకి చేరిందని నరేందర్ రెడ్డి తెలిపారు. దీంతో సుమారు 20 ఎకరాల్లో సాగు చేసిన మినుము పంట నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో నిల్వ చేసిన ఎరువులు సైతం నీటిలో తడిసి నష్టపోయాయని పేర్కొన్నారు.

“ముందే హెచ్చరించా.. పట్టించుకోలేదు”

నీటి ప్రవాహ సామర్థ్యం పెరిగితే పంట పొలంలోకి నీరు చేరి నష్టం జరుగుతుందని ముందుగానే కాంట్రాక్టర్‌ను హెచ్చరించినప్పటికీ స్పందించలేదని రైతు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారం అందించి తనకు న్యాయం చేయాలని రైతు నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ, కాల్వలు, పైప్‌లైన్ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని కోరారు.తనకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటానికి సైతం సిద్ధమని రైతు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

🗓 08 Aug 2026 | 07:10 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top