రైతు గోస – బీజేపీ భరోసా యాత్ర ప్రారంభం
చివరి ధాన్యం బస్తా వరకు ప్రభుత్వమే కొనాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కొనుగోలు కేంద్రాల్లో రైతుల దోపిడీజరుగుతోందని …బీజేపీ నేతల ఆగ్రహం
వర్షాలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరిక

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితమే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీని కలిసి రైతుల సమస్యలను వివరించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.బీజేపీ బృందం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నట్లు తెలిసిన వెంటనే అధికారులు రాత్రికి రాత్రే ఖాళీ గన్నీ సంచులు తెప్పించి, తెల్లవారుజామునే ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో నిజమైన కొనుగోళ్లు జరగడం లేదని, కేవలం బీజేపీ భయంతోనే హడావుడిగా చర్యలు చేపడుతున్నారని అన్నారు.
10 నుంచి 15 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్నప్పటికీ వారికి టార్పాలిన్లు, బోరి సంచులు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తే బీజేపీ ఊరుకోదని, అన్నదాతలకు అండగా ఎల్లప్పుడూ పోరాడుతామని స్పష్టం చేశారు.
ఆలాగే బీజేపీ శాసనసభ ఫోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నది పూర్తిగా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఇంకా 75 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు కాకుండా కల్లాల్లోనే ఉండిపోయిందని తెలిపారు.
రాబోయే వారం రోజుల్లో వర్షాలు కురిస్తే రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోతుందని, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఖర్చులు, గన్నీ బ్యాగుల డబ్బులు రైతుల నుంచే వసూలు చేస్తున్నారని, ఒక్కో బస్తాకు నాలుగు కిలోల వరకు అదనపు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ “వరంగల్ డిక్లరేషన్” పేరుతో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతు పండించిన చివరి గింజ కొనుగోలు చేసే వరకు “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర కొనసాగుతుందని, ప్రభుత్వంపై పోరాటం ఆపబోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, కాటెపల్లి వెంకట రామారెడ్డి, అంజిరెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, తాండూర్ సీనియర్ నేతలు మనోహర్ పటేల్ విజయ్ కుమార్, ఆంజనేయులు కౌన్సిలర్లు
శ్రీకాంత్ రెడ్డి, నాగారం మల్లేశం మహిళా నాయకులు తదితరులు
పాల్గొన్నారు
చివరి ధాన్యం బస్తా వరకు ప్రభుత్వమే కొనాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు..రైతు గోస – బీజేపీ భరోసా యాత్ర ప్రారంభం.
రైతు గోస – బీజేపీ భరోసా యాత్ర ప్రారంభం
చివరి ధాన్యం బస్తా వరకు ప్రభుత్వమే కొనాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కొనుగోలు కేంద్రాల్లో రైతుల దోపిడీజరుగుతోందని ...బీజేపీ నేతల ఆగ్రహం
వర్షాలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరిక
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మార్కెట్ యార్డ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా బస్సు యాత్ర” సోమవారం ప్రారంభమైంది. ఈ యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వం వహించారు. యాత్ర ప్రారంభం బీజేపీ నాయకులు కుల్కచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితమే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీని కలిసి రైతుల సమస్యలను వివరించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
బీజేపీ బృందం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నట్లు తెలిసిన వెంటనే అధికారులు రాత్రికి రాత్రే ఖాళీ గన్నీ సంచులు తెప్పించి, తెల్లవారుజామునే ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో నిజమైన కొనుగోళ్లు జరగడం లేదని, కేవలం బీజేపీ భయంతోనే హడావుడిగా చర్యలు చేపడుతున్నారని అన్నారు.
10 నుంచి 15 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్నప్పటికీ వారికి టార్పాలిన్లు, బోరి సంచులు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తే బీజేపీ ఊరుకోదని, అన్నదాతలకు అండగా ఎల్లప్పుడూ పోరాడుతామని స్పష్టం చేశారు.
ఆలాగే బీజేపీ శాసనసభ ఫోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నది పూర్తిగా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఇంకా 75 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు కాకుండా కల్లాల్లోనే ఉండిపోయిందని తెలిపారు.
రాబోయే వారం రోజుల్లో వర్షాలు కురిస్తే రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోతుందని, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఖర్చులు, గన్నీ బ్యాగుల డబ్బులు రైతుల నుంచే వసూలు చేస్తున్నారని, ఒక్కో బస్తాకు నాలుగు కిలోల వరకు అదనపు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ “వరంగల్ డిక్లరేషన్” పేరుతో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతు పండించిన చివరి గింజ కొనుగోలు చేసే వరకు “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర కొనసాగుతుందని, ప్రభుత్వంపై పోరాటం ఆపబోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, కాటెపల్లి వెంకట రామారెడ్డి, అంజిరెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, తాండూర్ సీనియర్ నేతలు మనోహర్ పటేల్ విజయ్ కుమార్, ఆంజనేయులు కౌన్సిలర్లు
శ్రీకాంత్ రెడ్డి, నాగారం మల్లేశం మహిళా నాయకులు తదితరులు
పాల్గొన్నారు
🗓 25 May 2026 | 04:19 PM
✍ Narender Patel journalist
https://varahispeednews.in