గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండాలంటే తప్పనిసరి ఈ-కేవైసీ.. గ్యాస్ నిర్వహకులు రాజేష్

గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండాలంటే తప్పనిసరి ఈ-కేవైసీ

గ్యాస్ నిర్వహకులు రాజేష్

మధుర గ్యాస్ ఆధ్వర్యంలో 6 రోజుల ప్రత్యేక ఈ-కేవైసీ మేళా

తాండూరు పట్టణంలోని గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మధుర గ్యాస్ ఏజెన్సీ ప్రత్యేక ఈ-కేవైసీ మేళాను నిర్వహిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని మధుర గ్యాస్ నిర్వాహకులు రాజేష్ సూచించారు.
గురువారం తాండూరు పట్టణంలో మధుర గ్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-కేవైసీ మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సికింద్రాబాద్ ఏరియా మేనేజర్ లలిత, వికారాబాద్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీజ దత్త వారి ఆదేశాలతో
పట్టణంలోని గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఆరు రోజుల పాటు ప్రత్యేక మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ వివరాలు నవీకరించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక లేదా సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ-కేవైసీ ప్రక్రియ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ మేళాను వాల్మీకి నగర్‌లోని వీవీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంతో పాటు శాంతినగర్ కాలనీలోని పార్కు వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.అర్హులైన వినియోగదారులందరూ ఆధార్, గ్యాస్ కనెక్షన్ సంబంధిత పత్రాలతో వచ్చి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్యాస్ సేవలను నిరంతరంగా పొందాలని కోరారు.
గ్యాస్ వినియోగదారులందరికీ మరింత సులభంగా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

🗓 05 Jun 2026 | 12:26 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top