ధాన్యం తరలింపు వేగవంతం
– అకాల వర్షాల నేపథ్యంలో రైతన్నలకు నష్టం వాటిల్లకుండా
– అదనపు లారీలు, ట్రాక్టర్లతో తడిసిన ధాన్యాన్ని పారా బాయిల్డ్ మిల్లులకు తరలింపు
– వెల్లడించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్:యాసంగి 2025-26 సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా మరియు మిల్లులకు తరలింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల పరిధిలో సుమారు 3000 వేల బ్యాగులు, 120 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
*ధాన్యం తరలింపుపై ప్రత్యేక చర్యలు*
తడిసిన ధాన్యం రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి అత్యవసరంగా పారా బైయిల్డ్ మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టామన్నారు. నిన్న ఒక్క రోజే సుమారు 120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సమీపంలోని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు విజయవంతంగా తరలించారు. ఎక్కడైతే వర్షపు నీటితో తడిసిన ధాన్యాన్ని సంచుల్లో నింపి మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పిపిసి సెంటర్ పరిగి మండలం సుల్తాన్ పూర్,గ్రామం, పి పి సి సెంటర్ బాలం పేట్ గ్రామం, దౌల్తాబాద్ మండలం, పి పి సి సెంటర్ మేకవనం పల్లి గ్రామం, మోమిన్ పేట్ మండలం, పిపిసి సెంటర్ ముజాయిద్ పూర్ గ్రామం కుల్క చెర్ల మండలం ల లో నిల్వ చేసిన వరి ధాన్యం వర్షాల కారణంగా పూర్తిగా తడిసిపోవడంతో అధికారులు వెంటనే స్పందించి పరిశీలించిపారా బాయిల్డ్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు.
రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ధాన్యాన్ని సురక్షితంగా తరలించి ఎంఎస్పీ చెల్లింపులు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లులకు తరలింపు మరియు ఎంఎస్పీ చెల్లింపుల ప్రక్రియలను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం తరలింపు వేగవంతం
ధాన్యం తరలింపు వేగవంతం
- అకాల వర్షాల నేపథ్యంలో రైతన్నలకు నష్టం వాటిల్లకుండా
- అదనపు లారీలు, ట్రాక్టర్లతో తడిసిన ధాన్యాన్ని పారా బాయిల్డ్ మిల్లులకు తరలింపు
- వెల్లడించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి