యాలాల PACS కార్యాలయంలో రైతులకు జనుము విత్తనాల పంపిణీ

వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని PACS కార్యాలయంలో రైతులకు జనుము (పచ్చి రొట్టె ఎరువు) విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి శ్వేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రైతుల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 74 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.పచ్చి రొట్టె ఎరువు సాగు ద్వారా భూమి సారవంతం పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంట పొలాల్లో సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.విత్తనాలు పొందాలనుకునే రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో సంబంధిత క్లస్టర్ ఏఈఓను సంప్రదించి టోకెన్ తీసుకోవాలని తెలిపారు. అనంతరం PACS కార్యాలయం వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, PACS ప్రతినిధులు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విత్తనాల పంపిణీపై సంతోషం వ్యక్తం చేశారు.

🗓 27 May 2026 | 07:45 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top