బాబుకి సిపిఆర్ తో ప్రాణం పోసిన 108 సిబ్బంది

క్షేమంగా ఆసుపత్రికి చేరుకున్న శిశువు
సమయస్ఫూర్తితో చిన్నారిని కాపాడిన 108 సిబ్బంది

శ్వాస సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం నగరానికి వెళ్తుండగా ఓ నవజాత శిశువుకు సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన 108 సిబ్బంది. వివరాల్లోకి వెళితే.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూర్ లోని మాతా శిశు ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు నిన్నటి నుండి శాస సమస్య రావడంతో ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో 108 అంబులెన్స్ లో బాబుని తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నారికి శ్వాస సమస్యతో బాధపడి కొట్టుమిట్టాడగా దీనిని గమనించిన 108 ఈఎంటి శాంత్ కుమార్, పైలట్ అయుబ్ పాషా సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి చిన్నారిని కాపాడారు. దీంతో పాపను క్షేమంగా నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి తమ బాబుని కాపాడిన 108 సిబ్బందిని చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారిని కాపాడిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు.

🗓 31 May 2026 | 01:46 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top