నవాబ్‌పేట్‌లో మట్టి మాఫియా బరితెగింపు!*

*నవాబ్‌పేట్‌లో మట్టి మాఫియా బరితెగింపు!*

*ఈద్గాకు వెళ్లే తోవను సైతం తవ్వివేత – ఆందోళనకు దిగిన ముస్లిం సోదరులు*

అక్రమంగా మట్టి తరలిస్తున్న , దర్గా రోడ్డుకి రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి.

వికారాబాద్,నవాబు పేట్:
మండల కేంద్రంలోని చిట్టిగిద్ద ఈద్గా వైపు వెళ్లే ప్రధాన దారిని మట్టి మాఫియా అక్రమంగా తవ్వివేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రార్థనల కోసం ఈద్గాకు వెళ్లే మార్గాన్నే వదలకుండా తవ్వేయడంపై ముస్లిం సోదరులు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనతో చిట్టిగిద్ద లో స్థానికులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ మార్గం ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
“ప్రజల అవసరాలకు ఉపయోగపడే దారిని కూడా కాపాడలేకపోతే అధికారులు ఎందుకు?” అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేసి, దారిని పునరుద్ధరించాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా మట్టి తరలించిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

🗓 28 May 2026 | 05:43 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top