వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
తూకంలో వ్యత్యాసాలు, ధాన్యం తరలింపులో జాప్యం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
పద్మావతి రైస్ మిల్ నిర్వాహకుడికి హెచ్చరిక
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ అక్కడ భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం తూకంలో నాలుగు కిలోల వరకు వ్యత్యాసం చూపిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సంబంధిత అధికారులను మందలిస్తూ తక్షణమే తూకం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి అక్రమాలు జరిగితే సహించబోమని స్పష్టం చేశారు.
అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వివరించడంతో వెంటనే ట్రాన్స్‌పోర్ట్ లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఇక స్థానిక రైస్ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ నేరుగా స్థానిక పద్మావతి రైస్ మిల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్ నిర్వాహకుడి పై రైతులు పలు ఆరోపణలు చేశారు. సరైన సమయంలో ధాన్యం తీసుకోవడం లేదని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ మిల్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం స్వీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తూ, నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతుల శ్రమ వృథా కాకుండా ధాన్యం కొనుగోలు, తూకం, తరలింపు ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఈ తనిఖీలలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్, తాండూర్ ఆర్డీవో అనిత, డిప్యూటీ తాసిల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో ఆనంద్ కుమార్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ చారి వివిధ శాఖ అధికారులు, డీసీఎంఎస్ నిర్వాకులు సలీం భాషా , తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు తదితరులు ఉన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
తూకంలో వ్యత్యాసాలు, ధాన్యం తరలింపులో జాప్యం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
పద్మావతి రైస్ మిల్ నిర్వాహకుడికి హెచ్చరికవికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ అక్కడ భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు.