ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి – తాండూర్ ఆర్డీఓ అనిత

ఒక వ్యక్తికి దేశవ్యాప్తంగా ఒకే ఓటు మాత్రమే ఉండాలని సూచన..ఆర్డీఓ అనితప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) కోరిన అన్ని అవసరమైన పత్రాలను ఓటర్లు సమర్పించాలని తాండూర్ ఆర్డీఓ అనిత ఓటర్లతో పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఓటరికి ఒకే ఓటు మాత్రమే ఉండాలని, రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేస్తే భారత ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు సంబంధిత ఓటరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.శనివారం యాలాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ గాయత్రి, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివచరణ్, సీనియర్ అసిస్టెంట్ నవీన్ తదితరులతో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఆర్డీఓ సమీక్షించారు.ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అనర్హులు, ద్వంద్వ ఓటర్లు, మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.సమీక్ష సమావేశం అనంతరం యాలాల మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆర్డీఓ అనిత ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు చేపడుతున్న పనితీరును పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

🗓 04 Jul 2026 | 06:51 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top