అనాథ కుటుంబానికి అండగా నిలిచిన సేవా సంస్థలు.. ఇద్దరు చిన్నారుల తల్లికి రూ.18 వేల కుట్టు మిషన్ అందజేత
ఉపాధికి చేయూత.. ఆత్మస్థైర్యానికి బలమై నిలిచిన యూత్ ఫర్ సేవా – తెలంగాణ విద్యావంతుల వేదిక
సమాజంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో యూత్ ఫర్ సేవా సంస్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయి. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్పేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన శిరీష రాజు గౌడ్ భర్తను కోల్పోయి, కేవలం 2 నెలలు, 18 నెలల వయస్సున్న ఇద్దరు చిన్నారులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెకు రూ.18 వేల విలువైన కుట్టు మిషన్‌ను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ కుట్టు మిషన్ శిరీష కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించడమే కాకుండా, జీవితంపై కొత్త ఆశలు, మనోధైర్యాన్ని నింపుతుందని తెలిపారు. అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ గౌరారం గోపాల్, గ్రామ సర్పంచ్ కాశప్ప, వీవోఏ చరిత, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా నాయకులు సూర్య నాయక్, మహిళా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని శిరీషకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.
అనాథ కుటుంబానికి అండగా నిలిచిన సేవా సంస్థలు.. ఇద్దరు చిన్నారుల తల్లికి రూ.18 వేల కుట్టు మిషన్ అందజేత
అనాథ కుటుంబానికి అండగా నిలిచిన సేవా సంస్థలు.. ఇద్దరు చిన్నారుల తల్లికి రూ.18 వేల కుట్టు మిషన్ అందజేత
ఉపాధికి చేయూత.. ఆత్మస్థైర్యానికి బలమై నిలిచిన యూత్ ఫర్ సేవా – తెలంగాణ విద్యావంతుల వేదికసమాజంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో యూత్ ఫర్ సేవా సంస్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయి. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్పేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన శిరీష రాజు గౌడ్ భర్తను కోల్పోయి, కేవలం 2 నెలలు, 18 నెలల వయస్సున్న ఇద్దరు చిన్నారులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెకు రూ.18 వేల విలువైన కుట్టు మిషన్‌ను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ కుట్టు మిషన్ శిరీష కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించడమే కాకుండా, జీవితంపై కొత్త ఆశలు, మనోధైర్యాన్ని నింపుతుందని తెలిపారు. అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.