65 ఏళ్ల నాటి ట్యాంక్‌ను కూల్చివేస్తుండగా ప్రమాదం.

65 ఏళ్ల నాటి ట్యాంక్‌ను కూల్చివేస్తుండగా ప్రమాదం.. విధవరాలి ఇల్లు శిథిలం – రెండు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఆర్థిక సాయం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్.వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఓ పేద కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చింది.
మంగళవారం గ్రామంలో సుమారు 65 సంవత్సరాల నాటి పాత ట్యాంక్‌ను అధికారులు కూల్చివేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆ ట్యాంక్ ఉరడి రాములమ్మ (60) నివాస గృహంపై పడింది. దీంతో ఇల్లు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది.
ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు, గోడలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ఇంట్లోని పెచ్చులు ఊడిపడి, కుటుంబ సభ్యులు నివసించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు ధ్వంసమవగా, నిల్వ ఉంచిన బియ్యంలో మట్టి, రాళ్లు చేరి పూర్తిగా పాడైంది.బాధితురాలు రాములమ్మ భర్త ఇప్పటికే మృతి చెందగా, ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు నవీన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, పెద్ద కుమారుడు రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో పడింది.ఈ ఘటనపై స్పందించిన తిమ్మాయిపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రెండు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే తగిన ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణకుమార్, కురువ కిష్టప్ప, వంగ శ్రీనివాస్ రెడ్డి, కోర్వాని శ్రీనివాస్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

🗓 07 Jul 2026 | 08:25 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top