తాండూరులో సంచలనం.. పాఠశాల యజమానికి యువనేత ఫోన్ బెదిరింపులు..!
“మీ స్కూల్‌కు పర్మిషన్ ఉందా..?” అంటూ ఫోన్‌లో హెచ్చరికలు.. ఆడియో వైరల్..!
యువనేతకు దీటుగా బదులిచ్చిన స్కూల్ యజమాని.. భయాందోళనలో సిబ్బంది..!
తాండూరు పట్టణంలో ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యజమానికి ఓ పార్టీకి చెందిన ఓ యువనేత ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.విశ్వసనియ సమాచారం ప్రకారం.., సదరు యువనేత పలుమార్లు పాఠశాల యజమానికి ఫోన్ చేసి, “మీ పాఠశాలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?”, “విద్యార్థులకు అధిక ధరలకు టైలు, బెల్టులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి” అంటూ ప్రశ్నిస్తూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆడియోలో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, తన మాట వినకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే యువనేత బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా పాఠశాల యజమాని ధైర్యంగా, చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లు ఆడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను అన్ని నిబంధనలను పాటిస్తూ పాఠశాలను నిర్వహిస్తున్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లు పెరగడం వల్ల తమ ఉద్యోగ భద్రతపై భయం నెలకొన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నేత అధికారిక స్పందన రావాల్సి ఉంది..
మీ స్కూల్‌కు పర్మిషన్ ఉందా..?” అంటూ ఫోన్‌లో హెచ్చరికలు.. ఆడియో వైరల్..!
తాండూరులో సంచలనం.. పాఠశాల యజమానికి యువనేత ఫోన్ బెదిరింపులు..!
"మీ స్కూల్‌కు పర్మిషన్ ఉందా..?" అంటూ ఫోన్‌లో హెచ్చరికలు.. ఆడియో వైరల్..!
యువనేతకు దీటుగా బదులిచ్చిన స్కూల్ యజమాని.. భయాందోళనలో సిబ్బంది..!
తాండూరు పట్టణంలో ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యజమానికి ఓ పార్టీకి చెందిన ఓ యువనేత ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.విశ్వసనియ సమాచారం ప్రకారం.., సదరు యువనేత పలుమార్లు పాఠశాల యజమానికి ఫోన్ చేసి, "మీ పాఠశాలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?", "విద్యార్థులకు అధిక ధరలకు టైలు, బెల్టులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి" అంటూ ప్రశ్నిస్తూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆడియోలో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, తన మాట వినకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే యువనేత బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా పాఠశాల యజమాని ధైర్యంగా, చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లు ఆడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను అన్ని నిబంధనలను పాటిస్తూ పాఠశాలను నిర్వహిస్తున్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లు పెరగడం వల్ల తమ ఉద్యోగ భద్రతపై భయం నెలకొన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నేత అధికారిక స్పందన రావాల్సి ఉంది..
