మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలి
51% ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి:
తపస్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్
ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి
యలాల్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన తపస్
ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులు పాల్గొని మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు ఒంగోని బాయ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీశైలం,తదితరులు మాట్లాడుతూ …రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణిని వీడి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత మూడు సంవత్సరాలుగా విడుదల చేయని కరువు భత్యాలు (డీఏలు) వెంటనే విడుదల చేయాలని, అలాగే పీఆర్‌సీ నివేదికను తక్షణమే తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు.
అదేవిధంగా, కేజీబీవీ సిబ్బంది సమ్మె కాలానికి సంబంధించిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసి, సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు సమస్యపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వం ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం, టిఫిన్ అమలు చేయాలనే ఆలోచన ఉపాధ్యాయుల గౌరవాన్ని కించపరచే చర్యగా భావిస్తున్నామని అన్నారు.
దీనిని తపస్ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కంటే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంపై దృష్టి పెట్టాలని, గుడ్డు ధరను ఒక్కో విద్యార్థికి రూ.8కు పెంచాలని, అలాగే మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాలను పెంచి వారికి న్యాయం చేయాలని అన్నారు.
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర మాజీ కోశాధికారి కరణం లక్ష్మీకాంతరావు, గౌరవాధ్యక్షుడు పి. శ్రీనివాసరావు, నియోజకవర్గ కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలి.. తపస్
మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలి
51% ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి:
తపస్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్
ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి
యలాల్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన తపస్
ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులు పాల్గొని మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు ఒంగోని బాయ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీశైలం,తదితరులు మాట్లాడుతూ ...రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణిని వీడి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.