రెండు బిస్కెట్లు – ఒక చాయ్‌కు రూ.7.5 లక్షలా?.. మున్సిపల్ కౌన్సిల్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం”

రూ.2.80 కోట్ల వ్యయం చేసినా తీరని తాగునీటి సమస్యలు –

కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని చైర్‌పర్సన్‌ పై బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా విమర్శలు

వికారాబాద్ జిల్లా తాండూరుమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బిస్కెట్లు, చాయ్ ఖర్చుల పేరుతో రూ.7.50 లక్షల బిల్లును ఎజెండాలో చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరుమున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా, పార్టీ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ…
కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు అందించే రెండు బిస్కెట్లు, ఒక కప్పు చాయ్ ఖర్చుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రూ.7.50 లక్షల బిల్లును ఎజెండాలో చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని, ఇటువంటి ఖర్చులపై సమగ్ర వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.అదే సమయంలో పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే సుమారు రూ.2.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని దీపా ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకవర్గం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన పాలకవర్గం, ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రజల అవసరాలను పక్కనబెట్టి, నిధుల వినియోగంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైన విధానం కాదన్నారు.
మున్సిపాలిటీలో ప్రతి రూపాయి ఖర్చుపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, ప్రజా ధనానికి జవాబుదారీతనం ఉండాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు

రెండు బిస్కెట్లు – ఒక చాయ్‌కు రూ.7.5 లక్షలా?.. మున్సిపల్ కౌన్సిల్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం”

రెండు బిస్కెట్లు – ఒక చాయ్‌కు రూ.7.5 లక్షలా?.. మున్సిపల్ కౌన్సిల్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం"

రూ.2.80 కోట్ల వ్యయం చేసినా తీరని తాగునీటి సమస్యలు –

కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని చైర్‌పర్సన్‌ పై బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా విమర్శలు

వికారాబాద్ జిల్లా తాండూరుమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బిస్కెట్లు, చాయ్ ఖర్చుల పేరుతో రూ.7.50 లక్షల బిల్లును ఎజెండాలో చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరుమున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా, పార్టీ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ...
కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు అందించే రెండు బిస్కెట్లు, ఒక కప్పు చాయ్ ఖర్చుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రూ.7.50 లక్షల బిల్లును ఎజెండాలో చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని, ఇటువంటి ఖర్చులపై సమగ్ర వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.అదే సమయంలో పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే సుమారు రూ.2.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని దీపా ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకవర్గం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన పాలకవర్గం, ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రజల అవసరాలను పక్కనబెట్టి, నిధుల వినియోగంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైన విధానం కాదన్నారు.
మున్సిపాలిటీలో ప్రతి రూపాయి ఖర్చుపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, ప్రజా ధనానికి జవాబుదారీతనం ఉండాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు

🗓 03 Jul 2026 | 08:14 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top