పాఠశాలల వద్ద విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: బీఆర్ఎస్‌వీ

ఉదయం, సాయంత్రం పాఠశాల వేళల్లో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయాలని విజ్ఞప్తి

డీఎస్పీకి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్‌వీ

తాండూర్, జూలై 10 (న్యూస్):విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్‌వీ (భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) నాయకులు శుక్రవారం తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, దీనిపై వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా పాఠశాలల ప్రధాన ద్వారాల వద్ద బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, అలాగే పాఠశాలలు ముగిసే సాయంత్రం 3:55 గంటల నుంచి 5:00 గంటల వరకు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగానిలిపివేయాలని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా మైనర్‌లు వాహనాలు నడపకుండా కట్టడి చేసేలా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, ఆటోరిక్షాల్లో అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగించడాన్ని అరికట్టాలని కోరారు. ఈ అంశాలపై డీఎస్పీ సానుకూలంగా స్పందించి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్‌వీ నాయకులు తెలిపారు.అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహిస్తున్నామని, పాన్ షాపుల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నామని డీఎస్పీ వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్‌వీ జిల్లా నాయకులు దత్తాత్రేయ రావు , పట్టణ నాయకులు వినోద్ కుమార్, షాహెబ్ అడ్డూ, భాను, గణేష్, రాజేష్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

🗓 10 Jul 2026 | 06:26 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top