ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి.. రూ.1 లక్ష నగదు బహుమతి కైవసం!

లక్ష రూపాయల నగదు బహుమతికి మారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపిక

పదో తరగతిలో 566 మార్కులతో తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రథమ స్థానంవికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోనీ
పెద్దేముల్ మండలంమారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని నాగారం నిహారిక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అందించే రూ.1 లక్ష నగదు బహుమతికి ఎంపిక కావడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
మార్చి–2026 పదో తరగతి వార్షిక పరీక్షల్లో నిహారిక 566 మార్కులు సాధించి తాండూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించే రూ.1 లక్ష నగదు బహుమతికి నిహారిక ను ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా శనివారం
నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై సింగ్, తాండూరు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్, విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గద్దె గోపాల్, మేడిశెట్టి అనిల్ కుమార్, మరియు స్వరూప తదితరులు పాల్గొని నిహారికను అభినందించి నగదు చెక్కును అందించారు.విద్యార్థిని సాధించిన ఈ విజయం ఇతర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, కష్టపడి చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత విజయాలు సాధించగలరని
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్,ఉపాధ్యాయులు అన్నారు.విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

🗓 10 Jul 2026 | 02:39 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top