యాలాల మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉప్పరి వెంకటయ్య ఎన్నిక
ఉపసర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తా: ఉప్పరి వెంకటయ్య
శాలువాలు, పూలమాలలతో నూతన కమిటీకి ఘన సన్మానం
యాలాల మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీని ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అగ్గనూరు గ్రామ ఉపసర్పంచ్ ఉప్పరి వెంకటయ్యను మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పరి వెంకటయ్య మాట్లాడుతూ, “నాయకత్వం అనేది ఒక పదవి కాదు.. అది ఒక బాధ్యత. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని ప్రతి ఉపసర్పంచ్‌కు అండగా నిలుస్తాను. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాను” అని అన్నారు. తనను సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న తోటి ఉపసర్పంచులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉప్పరి వెంకటయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులను తోటి ఉపసర్పంచులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
సంఘం నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా శోభారాణి, మోహన్, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా మాధవి, సలహాదారుగా కుర్వ మహేష్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో బెన్నూర్ ఉపసర్పంచ్ రఘు, మంజుల జగన్నాథం, నరేష్, బుజ్జి, వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు.
యాలాల మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉప్పరి వెంకటయ్య ఎన్నిక
యాలాల మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉప్పరి వెంకటయ్య ఎన్నిక
ఉపసర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తా: ఉప్పరి వెంకటయ్య
శాలువాలు, పూలమాలలతో నూతన కమిటీకి ఘన సన్మానంయాలాల మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీని ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అగ్గనూరు గ్రామ ఉపసర్పంచ్ ఉప్పరి వెంకటయ్యను మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పరి వెంకటయ్య మాట్లాడుతూ, "నాయకత్వం అనేది ఒక పదవి కాదు.. అది ఒక బాధ్యత. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని ప్రతి ఉపసర్పంచ్‌కు అండగా నిలుస్తాను. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాను" అని అన్నారు. తనను సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న తోటి ఉపసర్పంచులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉప్పరి వెంకటయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులను తోటి ఉపసర్పంచులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.