సైబేజ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భళా
– విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగిద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, అలాగే నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గచ్చిబౌలిలోని సైబేజ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా సైబేజ్ ఆశ ద్వారా విద్యా సామగ్రిని పంపిణీ చేసింది.ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులు మరియు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 82 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, క్రయాన్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా సైబేజ్ ఆశ సీనియర్ సి.ఎస్.ఆర్. ఎగ్జిక్యూటివ్ అనపురపు సురేష్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సైబేజ్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు, ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాలల అభివృద్ధికి సంస్థ తన వంతు సహాయ సహకారాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సైబేజ్ ఆశ ప్రతినిధులు అనపురపు సురేష్ తిరుపతి, కృష్ణ చైతన్య, సాయి ప్రసాద్, సంతోష్, బాపిరాజు, రాజశేఖర్, గౌతమి, రాజశ్రీ, అక్షయ, చిట్టిగిద్ద సర్పంచ్ శ్రీధర్ రావు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ శేఖర్, ఉపాధ్యాయులు స్వప్న, శ్రీలత, శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
సైబేజ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భళా – విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ
సైబేజ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భళా
- విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ