మహిళా లోకం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయం
– మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు
– బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు టి.శ్రీదేవి
వికారాబాద్ : మహిళలకు రాజకీయాలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును పాస్ కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు టి.శ్రీదేవి ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఎబి వాజ్ పేయి ఉన్నప్పటి నుంచి రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అప్పుడు కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, ఇప్పుడు కూడా వారి వారసులు మళ్లీ అడ్డుకున్నారని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళా బిల్లును అడ్డుకుని, జాతీయ విపత్తును అడ్డుకున్నామని పేర్కోనడం సిగ్గు చేటన్నారు. ఎంఐఎం, కమ్యూనిస్టులు, బిఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ మహిళా లోకం సరైన సమయంలో తగిన బుద్ది చెబుతుందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు మరోక్కసారి పునరాలోచన చేసి మహిళా బిల్లు పాస్ అయ్యేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మహిళా లోకం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయం
మహిళా లోకం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయం
- మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు
- బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు టి.శ్రీదేవి