జులై 14న కళాశాలల బంద్‌ను : ఏబీవీపీ తాండూరు నగర అధ్యక్షుడు నర్సింలు

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్తాండూరు, జులై 13: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ తాండూరు నగర అధ్యక్షుడు నర్సింలు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులు కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ జులై 14న కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ బంద్‌కు తాండూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని నర్సింలు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్, నాయకులు నవీన్ గౌడ్, పవన్, మారుతి, మధుసూదన్ రెడ్డి, జాఫర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

🗓 13 Jul 2026 | 04:39 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top