యోగ సాధనతో ఆరోగ్యం సురక్షితం * దీర్ఘకాల వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స

యోగ సాధనతో ఆరోగ్యం సురక్షితం
* దీర్ఘకాల వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స
* యోగాసనాలు పలు అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం
* ఆరోగ్యాన్ని మెరుగు పరిచే దివ్య ఔషధం జీవామృతం
* యోగాసనాల నైపుణ్య గురువులు క్యాసాని అనంతయ్య నారాయణ రాథోడ్వికారాబాద్: ఆరోగ్యానికి రక్షణ కవచంలా యోగాసనాలు పనిచేస్తాయని యోగాసనాల నైపుణ్య గురువులు క్యాసాని అనంతయ్య నారాయణ రాథోడ్ అన్నారు. యాంత్రిక జీవన పోరాటంలో మనిషి తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని వారు తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం ( కోడిగుడ్డు బావికి ఎదురుగా ) లో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు యోగా సాధన ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు రకాల అనారోగ్య రుగ్మతలకు చక్కని చికిత్స యోగ సాధననే విరుగుడుగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. దీర్ఘకాల వ్యాధులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట యోగాసనాలు సాధన చేస్తే క్రమక్రమంగా వ్యాధులు నయమవుతాయని చెప్పారు. యోగాసనాలు ప్రారంభించే ముందు సూక్ష్మ వ్యాయామం చేయాల్సి ఉంటుందని అన్నారు. సూక్ష్మ వ్యాయామములో తాడాసన్ వృక్షాసన్ అర్థ కటి చక్రాసన పాదహస్తాసన త్రికోణాసన సూర్య నమస్కారాలు భుజంగాసన ధనురాసనం ఉత్త అనుపాదాసన భవనముక్తాసన మరకత నౌకాసన వంటి ఆసనాలు చేయాలి. ఈ ఆసనాలు చేయడం వల్ల మనిషికి ఏ విధమైన అనారోగ్యం రాకుండా ఉంటుంది. కావున ఎక్కువ శాతం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఏ రకమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ ఏ ఆసనాలు ఎక్కువ చేయాలన్న విషయాలను నైపుణ్య యోగ గురువులు వివరిస్తారు. ఆ ఆసనాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దివ్య ఔషధంలా జీవాహారం పనిచేస్తుంది. జీవాహారం ( అమృత ఆహారం )కాకర కీర అరటిపండు ద్రాక్ష బెల్లం తర్బూజ కర్బూజ బీట్రూట్ పల్లి మొలకెత్తిన పెసలు చెనిగలు మొక్కజొన్న జామ కొబ్బరి బొప్పాయి ఖర్జూర ముల్లంగి నల్ల కుసుమ విత్తనాలు గుమ్మడి విత్తనాలు కర్బూజ విత్తనాలు దానిమ్మ గింజలు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. యోగశిక్షణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగశిక్షణార్థులు పాల్గొన్నారు.

🗓 19 Apr 2026 | 01:29 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top