కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాక
ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు

తెలంగాణ కాంగ్రెస్లో (Telangana Congress) నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్లో జరిగే డీసీసీ (DCC) అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి చేరుకుంటారు. ఉదయం 10:20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్కు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ చేరుకుని, అక్కడి హరిత హోటల్లో జరిగే శిక్షణ తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు.
కీలక చర్చలు..
రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.