టీజీ ఆర్గానిక్ యాప్ ప్రారంభం – సేంద్రియ రైతులకు కొత్త దారి.. మంత్రి తుమ్మల

రైతుల పంటల కొనుగోలులో కేంద్రం పూర్తిగా విఫలం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ పై కేంద్రం వివక్షత: వరి కొనుగోలు, యూరియా సరఫరాలో నిర్లక్ష్యం

రైతు వారోత్సవాలకు శ్రీకారం చుట్టిన మంత్రి

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వివిధ రకాల పండ్లు, ధాన్యాలు, వాణిజ్య పంటలను స్టాళ్ల రూపంలో ప్రదర్శించారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు అధికారులతో కలిసి స్టాళ్లను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు తోడ్పడే “టీజీ ఆర్గానిక్” యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులు వాడుతూ పంటలు పండించాలని అన్నారు. ఆరోగ్యమైన జీవితం ఉండాలంటే సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం ముఖ్యమని అన్నారు. ఈ క్రమంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను సన్మానం చేశారు.
అనంతరంమీడియా సమావేశంలో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించినప్పటికీ వాటిని కొనుగోలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. ముఖ్యంగా వరి కొనుగోలులో వెనుకంజ వేస్తూ తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటికీ, కేంద్రం సిసిఐ, నాఫెడ్ వంటి సంస్థల ద్వారా పంటలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా యూరియా, గన్ని బ్యాగులు వంటి అవసరమైన సరఫరాల్లో కూడా కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గ్యాస్, డీజిల్ కొరత ఏర్పడి రవాణా వ్యవస్థ స్తంభించిందని, దీంతో గన్ని బ్యాగుల సరఫరా నిలిచిపోయి పంట కొనుగోళ్లు ఆలస్యమయ్యాయని మంత్రి తెలిపారు. ఈ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియా వంటి ఎరువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే “టీజీ ఆర్గానిక్” యాప్ ద్వారా సేంద్రియ రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసి సమస్యలను తెలియజేసినా స్పందన లేకపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కేంద్రాన్ని హెచ్చరించారు.తాండూర్‌లో జరిగిన రైతు వారోత్సవాలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

🗓 04 May 2026 | 05:05 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top