తాండూర్‌లో ఇండ్ల కేటాయింపుపై దుమారం

తాండూర్‌లో ఇండ్ల కేటాయింపుపై దుమారం

ఒకే వర్గానికి 200 ఇండ్లు.. రాజకీయంగా హాట్ టాపిక్

పాలకుల సమక్షంలో వివాదాస్పద డ్రా.. నిబంధనల ఉల్లంఘననా?

తాండూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి!తాండూర్ పట్టణంలో ప్రభుత్వ పథకంగా పేదలకు అందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకే వర్గానికి చెందిన వారికి సుమారు 200 ఇండ్లను డ్రా పద్ధతి ద్వారా కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణంలోని 36 వార్డుల నుంచి ఒక వర్గానికి చెందిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన జీఎంకే ట్రస్ట్, అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఆదివారం ట్రస్ట్ కార్యాలయంలో డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. ఈ ప్రక్రియను ట్రస్ట్ వ్యవస్థాపకులు ముజీబ్ ఖాన్ నిర్వహించారు. అయితే
ఈ కార్యక్రమానికి తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ, వైస్ చైర్‌పర్సన్ అబ్దుల్ రజాక్, కొంత మంది కౌన్సిలర్లు  హాజరై డ్రా పద్ధతిలో ఇండ్ల కేటాయింపును నిర్వహించడం గమనార్హం గా మారింది.
ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడంపై స్థానిక ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా, ట్రస్ట్ ద్వారా కేటాయింపులు జరగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు

*ప్రజల్లో అసహనం – సోషల్ మీడియాలో విమర్శలు*

ఈ వ్యవహారం తాండూర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “ప్రజా పాలన అంటే ఇదేనా?” అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా మండి పడ్డారు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందనీ అన్నారు.లబ్ధిదారుల ఎంపిక సాధారణంగా శాసనసభ్యులు లేదా జిల్లా రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించడం నిబంధనలకు విరుద్ధము అని అసహనం వ్యక్తం చేశారు.తాండూర్‌లో జరిగిన ఈ ఇండ్ల కేటాయింపు వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసే అవకాశముందనీ. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత, సమానత్వం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చాటుతోందనీ పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు

🗓 03 May 2026 | 05:58 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top