*అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు*
*యాలాల..*. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు. యాలాల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం అందాజ 6 గంటలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాగసముందర్ గ్రామానికి చెందిన తోకలి రాజు, మహేష్ ల యొక్క రెండు ఇసుక ట్రాక్టర్లు ట్రాక్టర్ నెంబర్ టీ. ఎస్ 3 ఈ 0701, ట్రాక్టర్ నెంబర్ టీ. ఎస్.34 టీ. బి.6954 ట్రాలీ నెంబర్ టీ. ఎస్.34 టీ. బి. 6955 ను విశ్వనాథ్ పూర్ గేటు సమీపంలో పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపాడు. మండలం లో ఎవరైనా ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు ఉంటాయని యాలాల పోలీసులు తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత* *అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు*
*అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు**యాలాల..*. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు. యాలాల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం అందాజ 6 గంటలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాగసముందర్ గ్రామానికి చెందిన తోకలి రాజు, మహేష్ ల యొక్క రెండు ఇసుక ట్రాక్టర్లు ట్రాక్టర్ నెంబర్ టీ. ఎస్ 3 ఈ 0701, ట్రాక్టర్ నెంబర్ టీ. ఎస్.34 టీ. బి.6954 ట్రాలీ నెంబర్ టీ. ఎస్.34 టీ. బి. 6955 ను విశ్వనాథ్ పూర్ గేటు సమీపంలో పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపాడు. మండలం లో ఎవరైనా ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు ఉంటాయని యాలాల పోలీసులు తెలిపారు.
