నమ్మించి..నయవంచన !
ఇద్దరు మహిళల దారుణ హత్య
అప్పు తిరిగివ్వమని అడిగితే ప్రాణాలు తీశారు
డబ్బులిస్తామని నమ్మించి రప్పించిన దుండగులు
హత్య చేసి మృతదేహాలను పూడ్చిపెట్టిన వైనం
మోయినాబాద్, చేవెళ్ల ఫార్మ్‌హౌస్‌లలో ఘాతుకం
తాండూరు పోలీసుల విచారణలో గుట్టురట్టు..
తమ అవసరాల కోసం ఇద్దరి దగ్గరి బంధువుల వద్ద అప్పు తీసుకొని తిరిగి అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు నమ్మించి నయవంచనకు పాల్పడి ఇద్దరి మహిళలను దారుణ హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో చోటుచేసుకుంది. తీవ్ర కలకలం రేపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి….
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాసిం పూర్ గ్రామానికి చెందిన అబేదా బేగం(60) అంగన్వాడి ఆయాగా పని చేస్తూ ఈనెల 5 వ తేదీన ఇంటి నుండి అదృశ్యమైంది. ఎక్కడ ఆచూకీ లభించక పోవడంతో ఈనెల 10న బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదేవిధంగా తాండూర్ పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్ బి (58) ఈనెల 9వ తేదీన అదృశ్యమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు మహబూబ్ బీ తప్పిపోయిందని ఈనెల 10న యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుల దర్యాప్తు చేపట్టిన తాండూరు రూరల్ పోలీసులకు తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలని లో నివసిస్తున్న భార్యాభర్తలు రెహమాన్ కరిమా బేగమ్ ల పై అనుమానం వచ్చింది. దీంతో తమదైన శైలిలో విచారించిన తాండూరు పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. అప్పు తీసుకున్న ఇద్దరు భార్య భర్తలు రెహమాన్ (ఆటోడ్రైవర్) , కరీమా బేగం లు ముందు వేసుకున్న పథకం ప్రకారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న తన బావమరిది తో కలిసి అప్పిచ్చిన ఇద్దరూ వేర్వేరు మహిళలను నమ్మించి పిలిపించి, మొయినాబాద్, చేవెళ్ల లోని వేర్వేరు ఫార్మ్‌హౌస్‌లలో దారుణంగా హత్య హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారు. ఈ జంట హత్యల కేసు రంగారెడ్డి జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలకు (60 ఏళ్ల పైబడినవారు) కొంతకాలంగా కొందరితో ఫైనాన్స్ (డబ్బుల) వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితులకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికిన నిందితులు, వారిని తాండూరు నుంచి ఇక్కడికి రప్పించారు.బాధితులు ఇక్కడికి చేరుకున్న తర్వాత నిందితులు వారిని విడివిడిగా తరలించారు. ఒక మహిళను మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫార్మ్‌హౌస్‌లో, మరో మహిళను చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంకొక ఫార్మ్‌హౌస్‌లో కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాలను ఆయా ఫార్మ్‌హౌస్‌లలోనే గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. మోయినాబాద్ పరిధిలోని ఫార్మ్‌హౌస్ నుండి ఇప్పటికే ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల పరిధిలోని ఫార్మ్‌హౌస్‌లో పూడ్చిపెట్టిన మరో వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లూస్ టీమ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు కేసును వేగవంతం చేశారు. పోలీస్ అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. వారిలో
కరీం బేగం, రహిమాన్, మరో వ్యక్తి అదుపులో ఉన్నట్లుగా సమాచారం.
నమ్మించి..నయవంచన ! ఇద్దరు మహిళల దారుణ హత్య
నమ్మించి..నయవంచన !
ఇద్దరు మహిళల దారుణ హత్య
అప్పు తిరిగివ్వమని అడిగితే ప్రాణాలు తీశారు
డబ్బులిస్తామని నమ్మించి రప్పించిన దుండగులు
హత్య చేసి మృతదేహాలను పూడ్చిపెట్టిన వైనం
మోయినాబాద్, చేవెళ్ల ఫార్మ్‌హౌస్‌లలో ఘాతుకం
తాండూరు పోలీసుల విచారణలో గుట్టురట్టు..
తమ అవసరాల కోసం ఇద్దరి దగ్గరి బంధువుల వద్ద అప్పు తీసుకొని తిరిగి అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు నమ్మించి నయవంచనకు పాల్పడి ఇద్దరి మహిళలను దారుణ హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో చోటుచేసుకుంది. తీవ్ర కలకలం రేపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి....