మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి, 27 ఏప్రిల్ 2026 గోమాత దినోత్సవం

గోమాత గౌరవ దినోత్సవంను ఘనంగా జరుపుకుందాం.

గోమాత రక్షణ కోసం తాసిల్దార్ కి వినతి పత్రం అందిద్దాం.

భారతదేశంలోని ప్రతి పౌరులు గోమాతను గౌరవించి గోమాత రక్షణకై గోమాత గౌరవ దినోత్సవం 27ఏప్రిల్ ఘనంగా జరుపుకుందామని గో సంరక్షవాదులు, తాండూర్ గోశాల నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం తాండూర్ పట్టణంలోని గోశాల నందు రాజస్థాన్ నుంచి వచ్చిన గోరక్షకుల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఏప్రిల్ 27వ తేదీన గో మాత గౌరవ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు గో శాల అధ్యక్షులు బాల్ రెడ్డి, కార్యదర్శి కోట్రిక కిరణ్ సభ్యులు ఆధ్వర్యంలో గౌరవ గో దినోత్సవం సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ.. దేశంలో ఉండే ప్రతి పౌరుడు గో సంరక్షణ కోసం గో గౌరవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు. గో హత్యలు జరగకుండా గో మాత గౌరవ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీన ప్రతి ఒక్కరు గో భక్తులు తాసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ గొంతును ప్రభుత్వానికి విన్నవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోశాల సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, గోపాలకృష్ణ, కిషోర్ పటేల్, మన్మోహన్ సారడ, పటేల్ విజయ్ కుమార్,రాము, తదితరులు ఉన్నారు

🗓 12 Mar 2026 | 11:34 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top