తాండూరులో కల్తీ ఐస్ క్రీమ్ పై కోరాడ
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం… ప్రమాదకర రసాయనాలతో ఐస్ క్రీమ్స్
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ యాక్షన్
ఇండస్ట్రియల్ కలర్స్, ఎక్స్‌పైరీ సరుకులతో తయారీ బండారం బట్టబయలు
భారీగా కల్తీ ఐస్ క్రీమ్స్, ముడి పదార్థాలు సీజ్
నిందితులపై కేసులు నమోదు

వికారాబాద్ జిల్లాతాండూరు పట్టణంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేపట్టారు.వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా తన బృందంతో కలిసి తాండూరులోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో భారీగా నిల్వ ఉంచిన కల్తీ ఐస్ క్రీమ్స్‌తో పాటు, తయారీలో వినియోగిస్తున్న ప్రమాదకర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాండూరుకు చెందిన మహ్మద్ అఫ్సర్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా, ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించరాని ఇండస్ట్రియల్ కలర్స్ మరియు గడువు ముగిసిన ముడి సరుకులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న కల్తీ సామగ్రిని పూర్తిగా సీజ్ చేశారు.
అదేవిధంగా, ఎస్బీఐ కాలనీకి చెందిన డి. శ్రీనివాస్ సాయిపూర్ రోడ్డులో నిర్వహిస్తున్న “శ్రీ నందిని ఐస్ క్రీమ్” కేంద్రంలో కూడా నాణ్యత లేని, హానికరమైన రంగులుమరియుఎక్స్‌పైరీముడిసరుకులువాడుతున్నట్లు బయటపడింది. అక్కడి నుండి కూడా భారీగా కల్తీ పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న కల్తీ ఐస్ క్రీమ్స్‌ను తదుపరి చర్యల కోసం తాండూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ… వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యాపారులు అధిక లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర రంగులు, అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారయ్యే ఐస్ క్రీమ్స్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కల్తీ వ్యాపారాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
తాండూరులో కల్తీ ఐస్ క్రీమ్ పై కోరాడ
తాండూరులో కల్తీ ఐస్ క్రీమ్ పై కోరాడ
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం… ప్రమాదకర రసాయనాలతో ఐస్ క్రీమ్స్
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ యాక్షన్
ఇండస్ట్రియల్ కలర్స్, ఎక్స్‌పైరీ సరుకులతో తయారీ బండారం బట్టబయలు
భారీగా కల్తీ ఐస్ క్రీమ్స్, ముడి పదార్థాలు సీజ్
నిందితులపై కేసులు నమోదు
వికారాబాద్ జిల్లాతాండూరు పట్టణంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేపట్టారు.వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా తన బృందంతో కలిసి తాండూరులోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో భారీగా నిల్వ ఉంచిన కల్తీ ఐస్ క్రీమ్స్‌తో పాటు, తయారీలో వినియోగిస్తున్న ప్రమాదకర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాండూరుకు చెందిన మహ్మద్ అఫ్సర్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా, ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించరాని ఇండస్ట్రియల్ కలర్స్ మరియు గడువు ముగిసిన ముడి సరుకులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న కల్తీ సామగ్రిని పూర్తిగా సీజ్ చేశారు.
అదేవిధంగా, ఎస్బీఐ కాలనీకి చెందిన డి. శ్రీనివాస్ సాయిపూర్ రోడ్డులో నిర్వహిస్తున్న "శ్రీ నందిని ఐస్ క్రీమ్" కేంద్రంలో కూడా నాణ్యత లేని, హానికరమైన రంగులుమరియుఎక్స్‌పైరీముడిసరుకులువాడుతున్నట్లు బయటపడింది. అక్కడి నుండి కూడా భారీగా కల్తీ పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.