వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు మరింత ఉధృతం
వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరింపు
బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలింపు
టెంట్ హౌస్‌లకు నోటీసులపై కార్మికులు, నాయకుల తీవ్ర ఆగ్రహం

వికారాబాద్ జిల్లా లో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా జోరుగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఈ సమ్మె జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపుతోంది.సమ్మె నేపథ్యంలో వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ బస్ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిపో పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, టౌన్ అధ్యక్షుడు గోపాల్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనతో బస్ డిపో వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. సమ్మె ప్రభావంతో ప్రజా రవాణా సేవలు దాదాపు స్థంభించిపోయాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక మరోవైపు సమ్మెకు మద్దతుగా వంటావార్పు నిర్వహించిన కార్మికులకు సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడం వివాదాస్పదమైంది. టెంట్ హౌస్ సామగ్రి లేదా ఇతర సహాయం అందిస్తే చర్యలు తీసుకుంటామని జారీ చేసిన నోటీసులపై కార్మికులు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు.
తాండూర్ డిపో వద్ద కార్మికులు నిర్వహించిన వంటావార్పుకు స్థానిక టెంట్ హౌస్ నుంచి సామగ్రి తీసుకురావడంపై పోలీసుల చర్యలను నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పట్టణంలోని టెంట్ హౌస్‌లు, ఫంక్షన్ హాల్‌లు ఎవరూ సామగ్రి అద్దెకు ఇవ్వరాదని నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.మొత్తంగా వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించగా, ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు మరింత ఉధృతం
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు మరింత ఉధృతం
వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరింపు
బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలింపు
టెంట్ హౌస్‌లకు నోటీసులపై కార్మికులు, నాయకుల తీవ్ర ఆగ్రహం
వికారాబాద్ జిల్లా లో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా జోరుగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఈ సమ్మె జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపుతోంది.సమ్మె నేపథ్యంలో వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ బస్ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిపో పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, టౌన్ అధ్యక్షుడు గోపాల్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనతో బస్ డిపో వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. సమ్మె ప్రభావంతో ప్రజా రవాణా సేవలు దాదాపు స్థంభించిపోయాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక మరోవైపు సమ్మెకు మద్దతుగా వంటావార్పు నిర్వహించిన కార్మికులకు సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడం వివాదాస్పదమైంది. టెంట్ హౌస్ సామగ్రి లేదా ఇతర సహాయం అందిస్తే చర్యలు తీసుకుంటామని జారీ చేసిన నోటీసులపై కార్మికులు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు.తాండూర్ డిపో వద్ద కార్మికులు నిర్వహించిన వంటావార్పుకు స్థానిక టెంట్ హౌస్ నుంచి సామగ్రి తీసుకురావడంపై పోలీసుల చర్యలను నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పట్టణంలోని టెంట్ హౌస్‌లు, ఫంక్షన్ హాల్‌లు ఎవరూ సామగ్రి అద్దెకు ఇవ్వరాదని నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.మొత్తంగా వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించగా, ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.