వీరశైవ సమాజం ఎన్నికలు 2026–28 ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రశాంతంగా ఓటు వేయండి:
ఎన్నికల ప్రధాన అధికారి బిర్కాడ్ నారాయణ
3 పోలింగ్ బూత్‌లు
ఒక్కొక్క బూత్ లో సుమారు 350 మంది
68 మందికి ప్రాక్సి ఓటు


వీరశైవ సమాజం ఎన్నికలు 2026–28 ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రశాంతంగా ఓటు వేయండి: ఎన్నికల ప్రధాన అధికారి బిర్కాడ్ నారాయణ
వీరశైవ సమాజం ఎన్నికలు 2026–28 ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రశాంతంగా ఓటు వేయండి:
ఎన్నికల ప్రధాన అధికారి బిర్కాడ్ నారాయణ
3 పోలింగ్ బూత్‌లు
ఒక్కొక్క బూత్ లో సుమారు 350 మంది
68 మందికి ప్రాక్సి ఓటు
వీరశైవ సమాజం 2026–28 ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి బిర్కాడ్ నారాయణ తెలిపారు. ఆదివారం జరగనున్న ఓటింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడిన వివరాల ప్రకారం..ఓటింగ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుందనీ తెలిపారు. సమాజంలో మొత్తం 1,061 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టుగా తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు.ఓటర్ల సౌకర్యార్థం 3 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి బూత్‌లో సుమారు 350 మంది ఓటర్లు ఓటు వేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. అలాగే, ఓటింగ్ కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం, అవసరమైన మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారనీ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 68 మంది ఓటర్లకు బదులుగా మరొకరు ఓటు వేసేందుకు అనుమతి కల్పించినట్లు కూడా తెలిపారు.అంతిమంగా, ప్రతి ఓటరు ప్రజాస్వామ్య విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది కోడ్లి సతీష్ కుమార్, కొత్తపల్లి ప్రకాశ్, గాజుల సిద్రమేశ్వర్, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.
