చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
– రౌడీ షీటర్లతో సిఐ రఘు కుమార్ ప్రత్యేక సమావేశం
వికారాబాద్ జనవరి 26:.రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,వికారాబాద్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రఘు కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ పి.ఎస్. పరిధిలోనిరౌడీషీటర్లతోప్రత్యేకసమావేశంనిర్వహించారు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలలో భయాందోళనలు సృష్టించే చర్యలకు పాల్పడకూడదని, కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మంచి ప్రవర్తనతో వ్యవహరించి, పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ఇకపై ఎవరైనా క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నట్లయితే, సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ పెడతాం, వారిపై చట్టపరమైన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, రాజకీయ వైరం పెంచే విధంగా పోస్టులు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి సడలింపు ఉండదని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
- రౌడీ షీటర్లతో సిఐ రఘు కుమార్ ప్రత్యేక సమావేశం
వికారాబాద్ జనవరి 26:.రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,వికారాబాద్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రఘు కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ పి.ఎస్. పరిధిలోనిరౌడీషీటర్లతోప్రత్యేకసమావేశంనిర్వహించారు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలలో భయాందోళనలు సృష్టించే చర్యలకు పాల్పడకూడదని, కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మంచి ప్రవర్తనతో వ్యవహరించి, పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ఇకపై ఎవరైనా క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నట్లయితే, సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ పెడతాం, వారిపై చట్టపరమైన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, రాజకీయ వైరం పెంచే విధంగా పోస్టులు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి సడలింపు ఉండదని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.