తాండూరులో ఘనంగా ప్రారంభమైన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఐదు రోజులపాటు వైభవంగా జాతర వేడుకలు

భక్తుల కోసం అన్నదానం, మంచినీటి ప్రత్యేక ఏర్పాట్లు

పల్లకి సేవ, రథోత్సవం, లంకాదహనం ప్రధాన ఆకర్షణలు

ఆంధ్ర–కర్ణాటక ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మంగళవారం ఉదయం తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.జాతర కమిటీ అధ్యక్షులు మేడి మహేష్, దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఐదు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాండూరు పట్టణంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం, మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భద్రేశ్వర స్వామి పల్లకి సేవ, రథోత్సవం, లంకాదహనం, పశు ప్రదర్శన, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయని అన్నారు.

మేడి మహేష్ (జాతర కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ“తాండూరు పట్టణంలో ప్రసిద్ధి గాంచిన భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అని అన్నారు అలగే శేఖర్ గౌడ్ (దేవాలయ ఈవో  మాట్లాడుతూ..
“భక్తుల సౌకర్యం కోసం అన్నదానం, మంచినీటి వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశాం. ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.అని తెలిపారు.

భక్తి, సంప్రదాయాల నడుమ తాండూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండటంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోతోంది.

🗓 07 Apr 2026 | 11:02 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top