ప్రగతి నాయకత్వంలో భక్తి విప్లవం… ఇంటింటికీ వాసవి మాత చేరువ!
భక్తి, సేవ, ఐక్యత కలయిక… వాసవి మహిళా సమాజం ప్రత్యేక కార్యక్రమం!
సమాజ సంక్షేమం కోసం మహిళల ముందడుగు
వాసవి మాత ఆశీస్సులతో ప్రజల సుభిక్షం
కోరిన అధ్యక్షురాలు ప్రగతి
తాండూర్ పట్టణంలో ఆర్యవైశ్య మహిళా సమాజం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇంటింటి వాసవి మాత పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వాసవి మహిళా సమాజం అధ్యక్షురాలు ప్రగతి అధ్యక్షత వహించారు.

ఇంటింటిలో వాసవి మాత పారాయణం
ప్రగతి నాయకత్వంలో భక్తి విప్లవం… ఇంటింటికీ వాసవి మాత చేరువ!
భక్తి, సేవ, ఐక్యత కలయిక… వాసవి మహిళా సమాజం ప్రత్యేక కార్యక్రమం!
సమాజ సంక్షేమం కోసం మహిళల ముందడుగు
వాసవి మాత ఆశీస్సులతో ప్రజల సుభిక్షం
కోరిన అధ్యక్షురాలు ప్రగతితాండూర్ పట్టణంలో ఆర్యవైశ్య మహిళా సమాజం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇంటింటి వాసవి మాత పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వాసవి మహిళా సమాజం అధ్యక్షురాలు ప్రగతి అధ్యక్షత వహించారు.
కార్యక్రమం మొదటి రోజున ప్రగతి నివాసంలో వాసవి మాత పారాయణ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణాలు, ప్రవచనాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.పూజా కార్యక్రమాల అనంతరం పాల్గొన్న మహిళలకు అల్పాహార విందు ఏర్పాటు చేసి సత్కరించారు. కార్యక్రమం సందర్భంగా వాసవి మహిళా సమాజం అధ్యక్షురాలు ప్రగతి మాట్లాడుతూ… వాసవి మాత అనుగ్రహం ప్రతి ఆర్యవైశ్య కుటుంబంలో సుఖశాంతులను నింపాలని ప్రార్థించినట్లు తెలిపారు.అదేవిధంగా రాష్ట్రంలోని మరియు దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సమాజం సభ్యులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
