జెండా పండుగ రోజున సేవా కార్యక్రమం
– విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన వ్యాపార వేత్త మోదుగు శ్రీధర్
– కృతఙ్ఞతలు తెలిపిన కరీంపూర్ గ్రామ ప్రజలు
– బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం
వికారాబాద్:…కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మోదుగు శ్రీధర్ కరీంపూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్థులకు 10 సైకిళ్లను పంపిణీ చేశారు.అంతేగాక సయ్యద్ హాశం(నసీర్) తో కలిసి కరీంపూర్ గ్రామంలో చదువుతున్న పేద విద్యార్థులకు 100 స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుందరి అనిల్ మాట్లాడుతూ…గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ… పదిమంది విద్యార్థులు పక్క గ్రామమైన మోత్కుపల్లి కి వెళ్లి చదువుకుంటారని, కావున విద్యార్థులకు సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షబానబి సాదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు నర్సింలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

జెండా పండుగ రోజున సేవా కార్యక్రమం
జెండా పండుగ రోజున సేవా కార్యక్రమం
- విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన వ్యాపార వేత్త మోదుగు శ్రీధర్
- కృతఙ్ఞతలు తెలిపిన కరీంపూర్ గ్రామ ప్రజలు
- బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం
వికారాబాద్:...కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మోదుగు శ్రీధర్ కరీంపూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్థులకు 10 సైకిళ్లను పంపిణీ చేశారు.అంతేగాక సయ్యద్ హాశం(నసీర్) తో కలిసి కరీంపూర్ గ్రామంలో చదువుతున్న పేద విద్యార్థులకు 100 స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుందరి అనిల్ మాట్లాడుతూ...గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ... పదిమంది విద్యార్థులు పక్క గ్రామమైన మోత్కుపల్లి కి వెళ్లి చదువుకుంటారని, కావున విద్యార్థులకు సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షబానబి సాదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు నర్సింలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
