నిస్వార్థంతో ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం
– 10వ వార్డులో అర్ధ సుధాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి అనంతగిరిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజలు కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా శాసన సభాపతి,వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు బలబరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచి, ప్రజల విశ్వాసంతో గెలిస్తే నిస్వార్థంగా ప్రజా సేవ చేయడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. 10వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మహిళలు–యువత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధించి, నాయకుడిగా కాదు – సేవకుడిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. నిజాయితీగా, పారదర్శకంగా ప్రజా సేవ చేయడానికే పూర్తి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి ప్రజలతో పేర్కొన్నారు.
నిస్వార్థంతో ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం
నిస్వార్థంతో ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం
- 10వ వార్డులో అర్ధ సుధాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం