యాలాల ఎస్ ఎల్ వి వైన్స్ షాప్ లో అర్ధరాత్రి చోరీ ఇనుప రేకు కోసి లోపలికి దిగిన దొంగలు

యాలాల ఎస్ ఎల్ వి వైన్స్ షాప్ లో అర్ధరాత్రి చోరీ

ఇనుప రేకు కోసి లోపలికి దిగిన దొంగలు

దొంగతనం సమయంలో ఒకరికి గాయం – రక్తపు ఆనవాళ్లు

రూ.5 వేల నగదు, మద్యం బాటిల్స్,ఒక స్పీకర్ అపహరణ

సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అయిన దృశ్యాలు

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో సంఘటన

వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక వైన్స్ షాపులో అర్ధరాత్రి సుమారు 1 గంట 16 నిమిషాల సమయంలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది.

షాప్ యజమాని వివరాల ప్రకారం..ఇద్దరు దొంగలు ముందుగా వైన్స్ షాప్ పైభాగంలో ఉన్న ఇనుప రేకును కోసి లోపలికి ప్రవేశించారు. షాప్‌లోకి దిగుతున్న సమయంలో ఒక దొంగకు గాయం కావడంతో రక్తం అక్కడ ఉన్న కూలర్ పై పడినట్లు గుర్తించారు.
లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు కోసం గాలించి, గల్లాలో ఉన్న సుమారు రూ.5 వేల చిల్లర డబ్బును అపహరించారు. అంతేకాకుండా రెండు క్వార్టర్ మద్యం బాటిల్స్ మరియు ఒక స్పీకర్‌ను కూడా తీసుకుని పారిపోయారు.ఈ ఘటనపై షాప్ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించారు. షాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అక్కడ లభించిన రక్తపు ఆనవాళ్లను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దొంగల గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.

🗓 05 Apr 2026 | 12:32 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top