తాండూరులో భక్తి తరంగం – భద్రేశ్వర స్వామికి మహిళల సామూహిక గానార్చన
“రావయ్య గురువరా…” అంటూ స్వామి సన్నిధిలో మార్మోగిన భక్తి గీతం
వీరశైవ మహిళల ప్రత్యేక సమర్పణ – బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వెలుగు
అక్కమాదేవి మహిళ కమిటీ ఆధ్వర్యంలో భక్తి గానసేవ
తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి, శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తాండూరు వీరశైవ సమాజ మహిళలు మరియు శ్రీ అక్కమాదేవి మహిళ కమిటీ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక భక్తి గీతాన్ని సామూహికంగా ఆలపించి భక్తి భావాన్ని చాటారు.
ఈ సందర్భంగా ఉదయం వేళ దేవాలయం ఆవరణలో మహిళలు ఒక్కటిగా చేరి, ఆధ్యాత్మిక వాతావరణంలో
“రావయ్య గురువరా తాండూరు పురహరా… సేవింతు నీ చరణాలా… కోటి దీప కాంతుల రావయ్య గురువరా…”అంటూ స్వామి వారి సన్నిధిలో గానార్చన చేశారు.
అలాగే
“భవా భావిగీ నివాసా… భక్త హృదయ చిద్విలాసా… భవ భయా రోగహరణా… మా భాగ్యదాత నీవే శరణా…”
అంటూ ఆలపించిన ఈ భక్తి గీతం అక్కడి భక్తులను ఆధ్యాత్మిక భావోద్వేగానికి గురి చేసింది.
ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ..,
శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారి కృప కోసం ఈ పాటను ప్రత్యేకంగా అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గానసేవ ద్వారా తమ భక్తిని వ్యక్తపరచడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు పటేల్ మల్లమ్మ, అధ్యక్షురాలు జొల్లు రోహిణి, సెక్రటరీ కోర్వార్ అంజలి, కోశాధికారి సులోచనతో పాటు కార్యవర్గ సభ్యులు కోకట్ నేత సింధు, అక్షర, ప్రభావతి, లక్ష్మీ, ఎడ్రం శ్రీదేవి, బాలి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
మొత్తంగా ఈ కార్యక్రమం భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది.