తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం
మొదటి రోజు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహణ
భజనలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్న వేడుకలు
భారీగా తరలివచ్చిన భక్తజనం – భక్తి పారవశ్యం
భక్తులకు అల్పాహారాలు – సేవలో ముందున్న పలు సమాజ ప్రతినిధులు
తాండూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగాకొనసాగుతున్నాయి. జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ మరియు దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మంగళవారం బ్రహ్మోత్సవాల మొదటి రోజు సందర్భంగా భద్రేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభమైన ఈ పల్లకి సేవ అర్ధరాత్రి రెండు గంటల వరకు భక్తిరసంతో కొనసాగింది.
పల్లకి సేవకు ముందు భజనలు, ఆటపాటలతో వాతావరణం భక్తిమయంగా మారింది. ముఖ్యంగా ఒగ్గు కళాకారుల విన్యాసాలు, పురంతాయాల ఆటపాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో వీరశైవ సమాజం సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు. భక్తుల శ్రీ భావిగి భద్రేశ్వర మహారాజ్ కి“హర హర మహాదేవ” నినాదాలతో మారుమోగింది.
ఇక భక్తులకు సేవ చేయడంలో వివిధ సమాజాలు ముందుండాయి. నగరేశ్వర భజన మండలి, వీరశైవ సమాజం, ఆర్యవైశ్య సమాజం సభ్యులు అడుగడుగునా అల్పాహారాలు ఏర్పాటు చేసి భక్తులకు అందించారు. మరికొందరు భక్తులు టీ, మంచినీళ్లు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మొత్తానికి శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల మొదటి రోజు భక్తి, భవిష్యత్ ఆశలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం… మొదటి రోజు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహణ
తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం
మొదటి రోజు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహణ
భజనలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్న వేడుకలు
భారీగా తరలివచ్చిన భక్తజనం – భక్తి పారవశ్యం
భక్తులకు అల్పాహారాలు – సేవలో ముందున్న పలు సమాజ ప్రతినిధులుతాండూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగాకొనసాగుతున్నాయి. జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ మరియు దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మంగళవారం బ్రహ్మోత్సవాల మొదటి రోజు సందర్భంగా భద్రేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభమైన ఈ పల్లకి సేవ అర్ధరాత్రి రెండు గంటల వరకు భక్తిరసంతో కొనసాగింది.
పల్లకి సేవకు ముందు భజనలు, ఆటపాటలతో వాతావరణం భక్తిమయంగా మారింది. ముఖ్యంగా ఒగ్గు కళాకారుల విన్యాసాలు, పురంతాయాల ఆటపాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ వేడుకల్లో వీరశైవ సమాజం సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు. భక్తుల శ్రీ భావిగి భద్రేశ్వర మహారాజ్ కి“హర హర మహాదేవ” నినాదాలతో మారుమోగింది.